వీడ్కోలుకు వేళాయె! | - | Sakshi
Sakshi News home page

వీడ్కోలుకు వేళాయె!

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

వీడ్కోలుకు వేళాయె!

వరంగల్‌ అర్బన్‌: గ్రేటర్‌ వరంగల్‌లో నేడు (బుధవారం) వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంలోని 19 చెరువుల వద్ద నిమజ్జనం జరగనుంది. అందుకోసం వివిధ శాఖల అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. వరంగల్‌ మహా నగర పాలక సంస్థ పరిధిలోని ప్రముఖంగా చిన్నవడ్డేపల్లి చెరువు, ఉర్సు రంగసముద్రం, గొర్రెకుంట కట్టమల్లన్న, గుండు చెరువు అగర్తల, మామునూరు బెస్తం చెరువు వద్ద నిమజ్జనం జరగనుంది. హనుమకొండ, కాజీపేటలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు, హసన్‌పర్తి పెద్ద చెరువు, గోపాలపురం, భీమారం, కడిపికొండ, మడికొండ, సోమిడి, ఎల్లాపూర్‌, గుండ్ల సింగారం, రాంపేట, రాంపూర్‌, సింగారం, చల్ల చెరువు వద్ద నిమజ్జన కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా శాఖల అధికారులు ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లపై తనిఖీలు చేస్తూ సూచనలిస్తున్నారు.

శాఖల వారీగా ఏర్పాట్లు ఇలా..

● మైనింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 30 క్రేన్లు ఏర్పాటు చేశారు. వరంగల్‌ చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద 7 క్రేన్లను, ఉర్సు రంగసముద్రం 6, బెస్తం చెరువు 2, ఖిలా వరంగల్‌ అగర్తలా ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. హనుమకొండ సిద్ధేశ్వర గుండం వద్ద 1, బంధం చెరువుల వద్ద 3, హసన్‌పర్తి పెద్ద చెరువు 2, కడిపికొండ, భీమారం, చల్ల చెరువు వద్ద ఒకటి తదితర విలీన గ్రామాల్లో క్రేన్లను అందుబాటులో ఉంచారు.

● బల్దియా ఆధ్వర్యంలో రోడ్లు చదును చేసి, ప్యాచ్‌ వర్క్‌లు, రోడ్డ విస్తరణరే రూ.కోటి ఖర్చు చేశారు. అన్ని చెరువుల వద్ద విద్యుత్‌ లైట్లతో జిగేల్‌మనేలా లైటింగ్‌ ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో మంచి నీటిని సరఫరా చేసేందుకు వాటర్‌ ట్యాంకర్లను సిద్ధం చేశారు. పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అంతేకాకుండా ప్రత్యేక అధికారులను, సిబ్బందిని నియమించారు. ఎలాంటి ఆవంఛానీయ ఘటనలు చోటు చేసుకోకుండా వరంగల్‌లోని చిన్నవడ్డేపల్లి, కోట చెరువు, ఉర్సు రంగసముద్రం, హనుమకొండ బంధం చెరువు, హసన్‌పర్తి పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేశారు. వీటిద్వారా పోలీసులు క్షణక్షణం పర్యవేక్షించనున్నారు.

● ఎన్‌పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్లను నెలకొల్పారు. విద్యుత్‌ అంతరాయం కలిగితే ప్రధాన చెరువుల వద్ద బల్దియా కాంట్రాక్టర్ల ద్వారా జనరేటర్లను అందుబాటులో ఉంచారు.

● ఆర్‌అండ్‌బీ శాఖ నేతత్వంలో ఆరు కేంద్రాలలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు.

● మత్స శాఖ 1,200 మంది గజ ఈతగాళ్లు, 26 తెప్పలు, బ్యాలెన్సింగ్‌ల ద్వారా సేవలు అందించనున్నారు. హనుమకొండ ప్రాంతలోని నిజమజ్జన కేంద్రాలకు ఈఈ రవికుమార్‌, వరంగల్‌ ప్రాంతంలో ఈఈ సంజయ్‌ కుమార్‌ను నిమమించినట్లు పేర్కొన్నారు. వీరీపై ఎస్‌ఈ రాజ్‌కుమార్‌ ఇన్‌చార్జ్‌గా వవ్యవహరిస్తారని కమిషనర్‌ టి.వెంకన్న వెల్లడించారు.

● రెవెన్యూ శాఖ ద్వారా ఐదుగురు తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది ఏర్పాట్లలో తలమునకలయ్యారు.

● మెడికల్‌ అండ్‌ హెల్త్‌ శాఖ ప్రతి నిమజ్జన కేంద్రం వద్ద ఉచితంగా మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా 108 వాహనాల ను ఆయా సెంటర్లలో ఏర్పాటు చేయనున్నారు.

● ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

● మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, 108 వాహనాలు ఏర్పాటు చేశారు.

● పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు, శాంతిభద్రత పర్యవేక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ చేయనున్నారు.

జిల్లాలో

నేడు వినాయక నిమజ్జనం

జల వనరుల వద్ద 32 క్రేన్లు, 1,200 మంది గజ ఈతగాళ్లు

శోభాయాత్ర దారిలో వీధిదీపాలు, ప్రధాన కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు

ఏర్పాట్లు పూర్తి చేసిన బల్దియా అధికారులు

వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

కలెక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: జిల్లాలో నేడు (బుధవారం) జరిగే గణేష్‌ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా సురక్షితంగా జరుపుకోవాలి కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. నిమజ్జన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ఆయా నిమజ్జన ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు, పడవలు, 108 అత్యవసర సేవలు, వైద్యబృందాలు అవసరమైన మందులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు తమకు కేటాయించిన సమయాల్లో తప్పనిసరిగా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement