దసరాకు చేయూత పింఛన్లు | - | Sakshi
Sakshi News home page

దసరాకు చేయూత పింఛన్లు

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

నెక్కొండ: దసరా పండుగ నాటికి కొత్త చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు నెక్కొండ మేజర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మంగళవారం కల్యాణలక్ష్మీ, షాదీ ముబాకర్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీ పథకాల అమలుతో పాటు మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. పథకాలను ప్రభుత్వం అందించడంలేదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. చేయూత పింఛన్ల మంజూరు కోసం క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారన్నారు. నెక్కొండ, చెన్నారావుపేట మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ. 91లక్షల విలువైన 90 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, నెక్కొండ, నర్సంపేట ఏఎంసీ చైర్మన్‌లు రావుల హరీశ్‌రెడ్డి, పాలాయి శ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌లు చల్లా శ్రీపాల్‌రెడ్డి, ఆవుల శ్రీనివాస్‌, భూక్య గోపాల్‌నాయక్‌, మొగిలి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్‌ వేముల రాజ్‌కుమార్‌, నాయకులు అశోక్‌, లావుడ్యా తిరుమల్‌, సర్పంచ్‌ పి.హరిప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement