సాక్షి, వరంగల్/కాశిబుగ్గ: పసికందుల ప్రాణాలను కాపాడాల్సిన ఎంజీఎం నవజాత శిశు చికిత్సా కేంద్రంలో మౌలిక వసతుల కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు జి ల్లాల నుంచి నెలలోపు శిశువులను అత్యవసర చికి త్స కోసం ఇక్కడికి తీసుకొస్తుండగా.. అవసరమైన స్థాయిలో ప్రాణరక్షక పరికరాలు లేవన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ రిమ్స్‌లో ని నవజాత శిశు విభాగంలో అగ్ని ప్రమాదం జరిగి చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఎంజీఎంలో భద్రతా ఏర్పాట్లపై కూడా చర్చ మొదలైంది.
మూడు యూనిట్లున్నా
శిశువులకు తప్పని తిప్పలు..
ఎంజీఎంలోని నవజాత శిశు చికిత్స విభాగంలో స్పెషల్ న్యూ బర్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీ యూ)లో రెండు యూనిట్లు, నియోనాటనల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసీయూ)లో ఒక యూ నిట్ పనిచేస్తోంది. 40 పడకల సామర్థ్యమున్న ఈ యూనిట్‌లలో నెలలోపు పసికందుల్లో కామెర్లు, శ్వాస సంబంధిత సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, ఫిట్స్, తక్కువ బరువుతో పుట్టిన వారు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులకు చికిత్స అందిస్తారు. ఎన్‌ఐసీయూలో అత్యంత సీరియస్ కేసులకు వెంటిలేటర్, తక్కువ బరువున్న శిశువులకు వార్మర్లు, శ్వా స ఇబ్బందులకు సీపాప్ తదితర పరికరాలు కీలకం. ఇవి అవసరానికి తగిన సంఖ్యలో లేవని ఆరోపణలు వస్తున్నాయి. ఒక వార్మర్‌లో వెచ్చదనం కోసం ఒకరిని పడుకోబెట్టాల్సి ఉండగా ఇద్దరిని పడుకోబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. సరిపడా వెంటిలేటర్లు, సీపాప్ సరిపోక శిశువుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయనే విమర్శలున్నాయి. కొన్ని పరికరాలు పనిచేయకున్నా ప్రత్యామ్నాయాలు లేక అటు వైద్యులు, ఇటు శిశువులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎన్ని పరికరాలు అవసరం? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? వాటిలో పని చేస్తున్నవి ఎన్ని? అనే వివరాలపై ఆస్పత్రి యా జమాన్యంనుంచి సరైన సమాధానం రావడం లేదు. పరికరాల కొరతపై అధికారులు, సిబ్బంది పలు మార్లు దృష్టికి తీసుకెళ్లినా బడ్జెట్ సమస్యల వల్ల పరిష్కారం ఆలస్యమవుతోందని తెలిసింది.
అవసరమైన పరికరాలు
లేకపోవడంతోనే తిప్పలు
ఫలితంగా అత్యవసర వైద్యంలో
ఇబ్బందులు
విద్యుత్, ఫైర్ సేఫ్టీ ఆడిట్‌పై లేని స్పష్టత
ఆదిలాబాద్ రిమ్స్ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో భద్రత, ఫైర్ ప్రివెన్షన్‌న్ ఆడిట్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో ఎంజీఎంలో ఫైర్ అలారం వ్యవస్థ, ఫైర్ ఎక్స్‌టింగ్విష్టర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, విద్యుత్ వైరింగ్, జనరేటర్, ఏసీ యూనిట్లు, ఎలక్ట్రికల్ లోడ్, వార్షిక ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ జరుగుతున్నాయా? లేవా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పెద్దల వార్డులతో పోలిస్తే నవజాత శిశు విభాగం పరిస్థితి పూర్తిగా భిన్నం. నడవలేని, స్వయంగా బయటకు రాలేని పసికందులు ఇంక్యుబెటర్లు, వార్మర్లలో ఉంటారు. అత్యవసర పరిస్థితి తలెత్తితే వారిని పరికరాలతో సహా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. అందుకే వైద్య పరికరాల లభ్యతతోపాటు అత్యవసర తరలింపు ప్రణాళిక కూడా కీలకమని, ఏదైనా ప్రమాదం జరిగినా వారిని ప్రాణాలతో బయటకు తీసుకెళ్లడం ముఖ్యమని వైద్యవర్గాలంటున్నాయి. దీనిపై ఎంజీఎం ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


