నర్సంపేట రూరల్: నర్సంపేట మహిళా ప్రత్యేక జైలులో భద్రత ఏర్పాట్లు చేశామని నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని మహిళా ప్రత్యేక కారా గార ప్రాంగణాన్ని మంగళవారం పరిశీలించా రు. జైలు ప్రాంగణంలోని సీసీటీవీల పనితీరు, కాంపౌడ్ హాల్, పరిసర ప్రాంతాలను, కీలక సెక్యూరిటీ పాయింట్లను పరిశీలించారు. అనంతరం పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నర్సంపేట టౌన్ సీఐ శ్రీనివాస్, నర్సంపేట జైలర్ స్రవంతి ఉన్నారు.
‘మరియపురం’లో
తమిళనాడు బృందం
గీసుకొండ: ఎస్‌ఐఆర్‌డీ–పీఆర్, తమిళనాడు గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శరణ్య ఆధ్వర్యంలో తమిళనాడు బృందం మండలంలోని మరియపురం గ్రామంలో మంగళవారం ఎక్స్‌పోజర్ విజిట్ నిర్వహించింది. గ్రామంలో రికార్డుల నిర్వహణ, జీపీఎస్‌ఏపీ, జీపీడీపీ, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ చెరువులు, మ్యాజిక్ సోక్ పిట్స్, బోర్‌వెల్ రీఛార్జ్ పిట్స్, శ్మశానవాటిక, పశువుల షెడ్లు, నర్సరీలను పరిశీలించారు. వీబీజీరాంజీ పనులు, రిజిస్టర్లు, వర్క్ ఫైల్స్, గ్రామ సమావేశాల నిర్వహణపై సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యకర్తలతో చర్చించారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులతో బ్యాంకు లింకేజీ రుణాలు, సీఐఎఫ్, సీ్త్రనిధి, జీవనోపాధి కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. డెయిరీ యూనిట్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, కిరాణా షాప్, వాటర్ ప్లాంట్ తదితర యూనిట్లను పరిశీలించి, మహిళలు ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అర్పిత దిలీప్ తిరుమలరెడ్డి, ఉపసర్పంచ్ బిట్ల శివప్రసాద్, డీఆర్‌డీఓ నాగపద్మజ, ఏపీడీ శ్రీవాణి, ఎంపీడీఓలు ప్రవీణ్‌కుమార్, కమలాకర్, ఎంపీఓ శేషు ఆంజనేయులు, ఏపీఓ చంద్రకాంత్, ఏపీఎం ఈశ్వరయ్య, సీసీ సురేశ్, కార్యదర్శి రజిత, తమిళనాడు అధికారులు సాహిత్య, లక్ష్మీ, దినేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు సకాలంలో మందులు ఇవ్వాలి
దుగ్గొండి: షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు సకాలంలో మందులు అందించాలని జిల్లా ఎన్‌సీడీ అధికారి ఇప్తికార్ అహ్మద్ సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని షుగర్, బీపీ మాత్రల పంపిణీ, రోగుల వివరాలను రిజిస్టర్లను తనిఖీ చేశారు. రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేన్సర్ రోగుల వివరాలను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీప్యూటీ డీఈఎంఓ వెంకటేశ్వర్లు, వైద్యాఽధికారి రాకేష్, హెచ్‌వీ సంధ్యారాణి, హెచ్‌ఈఓ గౌసు, స్వప్న పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల
నిర్మూలనకు కృషి చేయాలి
నర్సంపేట రూరల్: మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి విద్యార్థులు తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, వాటి నిర్మూలనకు ప్రతీఒక్కరు కృషి చేయాలని నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కళా శాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి తెలిపారు. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ జనరల్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఎన్నో లక్ష్యాలు పెట్టుకొని ఉన్నత చదువుల వైపు అడుగులు వేస్తున్నారని, కానీ మత్తు పదార్థాలకు బానిసై తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శ్రీదేవి, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పూనం, మైక్రో బయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉషారాణి, హెచ్‌ఈ విజయ్‌కుమార్, ఎంఎస్‌డబ్ల్యూ పద్మజ పాల్గొన్నారు.


