టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఈ నెల 17 నుంచి 19 వరకు నిజామాబాద్‌లో టీజీ ట్రాన్స్‌కో, డిస్కంల ఇంటర్ సర్కిల్ టేబుల్ టెన్నిస్ పోటీలు జరిగాయి. ఇందులో ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం జట్టు విజేతగా నిలిచింది. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విజేతలు, చీఫ్ జనరల్ మేనేజర్ వి.వేణుబాబు, చీఫ్ ఇంజనీర్ ఎ.సురేందర్, జి.గణేశ్.. సీఎండీని కలిసి ట్రోఫీ అందజేశారు. కాగా, ఓపెన్ డబుల్స్‌లో వి.వేణుబాబు, సురేందర్ ప్రథమ స్థానం సాధించగా, ఓపెన్ సింగి ల్స్‌లో వి. వేణుబాబు తృతీయ స్థానం సాధించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మోహన్రా వు, తిరుపతిరెడ్డి, సి.ప్రభాకర్, జీఎం ఎం.హేమంత్ కుమార్ పాల్గొన్నారు.


