హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్‌

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్‌

ధర్మసాగర్‌: రాజకీయ విభేదాలు, పాత కక్షల నేపథ్యంలో.. కాంగ్రెస్‌ పార్టీ వేలేరు మండల అధ్యక్షుడు మురావత్‌ లక్ష్మణ్‌ నాయక్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నలుగురు నిందితులను ధర్మసాగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ శ్రీనివాస్‌ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వేలేరు మండలానికి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్‌ సద్దాం హుస్సేన్‌ (ఏ1), లక్ష్మ ణ్‌నాయక్‌ రాజకీయ ఎదుగుదల, పార్టీ పదవులు, పాత ఎస్సీ, ఎస్టీ కేసుల విషయమై ఆయనపై కక్ష పెంచుకున్నాడు. లక్ష్మణ్‌నాయక్‌ అడ్డు తొలగించుకోవాలని బైరి అనిల్‌ (ఏ2), అందె కృపాసాగర్‌ (ఏ3), కురసపల్లి హరీశ్‌ (ఏ4)తో కలిసి హత్యాయత్నానికి కుట్ర పన్నాడు. ఈక్రమంలో ఈనెల 17న హనుమకొండ నుంచి ద్విచక్రవాహనంపై వేలేరుకు తిరుగు పయనమైన లక్ష్మణ్‌నాయక్‌ను సాయిపేట గ్రామ శివారులో నిందితులు మోటార్‌ సైకిల్‌పై వెంబడించారు. వెనుక నుంచి ఇనుప రాడ్డుతో తలపై తీవ్రంగా కొట్టి పారిపోయారు. బాధితుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధర్మసాగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సోమవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో వేలేరు ఎస్‌ఐ సురేశ్‌, ధర్మసాగర్‌ ఎస్‌ఐ దిలీప్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement