కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

Sep 22 2026 1:00 AM | Updated on Sep 22 2026 1:00 AM

ధర్మసాగర్‌: కాంగ్రెస్‌ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని అందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఎంపీ కడియం కావ్య పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పార్టీ కమిటీలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. ధర్మసాగర్‌ మండలంలోని సుష్మిత గార్డెన్‌లో సోమవారం నిర్వహించిన పార్టీ నూతన మండల, గ్రామ కాంగ్రెస్‌ కమిటీల పరిచయ కార్యక్రమానికి స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఎంపీ కావ్య హాజరయ్యారు. ఈసందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. తన ఎంపీ నిధుల వినియోగంపై బీఆర్‌ఎస్‌ నాయకులు కనీస అవగాహన లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్‌ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కేంద్ర మంత్రులను కలిసి ప్రతిపాదనలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు ధర్మసాగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు

ఎంపీ కడియం కావ్య

నూతన కాంగ్రెస్‌ కమిటీల పరిచయ కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement