వేయిస్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

వేయిస్తంభాల దేవాలయంలో ప్రత్యేక పూజలు

Sep 8 2026 1:05 AM | Updated on Sep 8 2026 1:05 AM

హన్మకొండ కల్చరల్‌: శ్రావణమాసంలోని చివరి సోమవారాన్ని పురస్కరించుకుని వేయిస్తంభాల ఆలయంలో శనివారం రుద్రేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు రుద్రేశ్వరస్వామికి అఘోర పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. 150 మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. పూజల్లో ఆధ్యాత్మికవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు, ఉమారాణి దంపతులు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు ప్రణవ్‌, శ్రవణ్‌ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement