నర్సంపేట: నర్సంపేట మున్సిపల్ పరిధిలోని దామెర చెరువు, మాధన్నపేట చెరువులను మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ సోమవారం మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, వైస్ చైర్మన్ గంధం నరేందర్‌గుప్తా, నర్సంపేట టౌన్ సీఐ ముస్క శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు ఆశించన స్థాయిలో కురవకపోవడంతో గణనాథుల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలిపారు. గ్రామస్తులు, అధికారుల సహకారంతో నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మాధన్నపేట చెరువులో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణానికి, కాలుష్యానికి హాని కలగకుండా మున్సిపల్ పరిధిలో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఉత్సవాల కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ చంద్రమౌళి, కౌన్సిలర్లు కొత్తకొండ మేఘనశ్యాంరాజ్, ముత్తినేని వెంకన్న, బీరం భరత్‌రెడ్డి, ఏపూరి శ్రీనివాస్‌రెడ్డి, ఎలకంటి విజయ్‌కుమార్, సలావుద్దీన్ అయూబ్‌ఖాన్, పొ న్నాల మనీషాప్రకాష్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ, యూత్ అధ్యక్షుడు తు మ్మలపల్లి సందీప్, మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, కాట ప్రభాకర్, కిరణ్‌యాదవ్, నాయకులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


