పకడ్బందీగా విచారణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా విచారణ చేపట్టాలి

Sep 8 2026 1:05 AM | Updated on Sep 8 2026 1:05 AM

వీసీలో ప్రధాన ఎన్నికల అధికారి

సుదర్శన్‌రెడ్డి

న్యూశాయంపేట: ఎస్‌ఐఆర్‌లో భాగంగా అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్లకు నోటీసులు అందించి పకడ్బందీగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి వీ డియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీ క్షించారు. విచారణ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవరించాలన్నారు. నిర్ణీత గడువులోగా నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో మూడు నియోజక వర్గాల్లో మొ త్తంగా 1,94,395 మందికి నోటీసులు జనరేట్‌ కాగా ఇందులో 96,911 మందికి నోటీసులు అందించామని, 5,001 మంది హియరి ంగ్‌కు హాజరైనట్లు వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్లు కిశోర్‌కుమార్‌, వైవీ.గణేశ్‌, ఆర్డీఓ లు సుమ, ఉమారాణి తదతరులు పాల్గొన్నారు.

రేపు మహిళలకు జాబ్‌మేళా

కాళోజీ సెంటర్‌/కాశిబుగ్గ: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 9న (బుధవారం) జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి.సాత్విక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మన అగ్రిటెక్‌ సంస్థలో టెలీ కాలర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఏదైనా డిగ్రీ విద్యార్హతతో 21 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు. ఎంపికై న వారు వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 9న ఉదయం 11 గంటలకు ములుగు రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

జాతీయస్థాయి కరాటేలో విద్యార్థుల ప్రతిభ

నర్సంపేట:జాతీయ స్థాయి కరాటే పోటీల్లో నర్సంపేట పట్టణానికి చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చి వెండి పతకాలు సాధించారు. ఈ మేరకు ఫణకుశి షాతోఖాన్‌ కరాటే డూ అ సోసియేషన్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌ షిహన్‌ భవానిచంద్‌ సోమవారం మాట్లాడుతూ కర్నూలు పట్టణ ంలోని పుష్పరాజ్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జీకేఎంఏ కరాటే సంస్థ ఆధ్వర్యంలో సెన్సాయ్‌ జగదీష్‌ వరల్డ్‌ కరాటే ఫెడరేషన్‌ రెఫరీ నిర్వహించిన జా తీయ స్థాయి కరాటే పోటీల్లో పట్టణానికి చెందిన జూనియర్‌ బాలిక విభాగంలో పి.అంజన, 17 సంవత్సరాల విభాగంలో ఉప్పు హనీ వెండి పతకాలు సాధించినట్లు తెలిపారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి సుమా రు 2వేల మంది విద్యార్థులు పాల్గొన్నారన్నా రు. టోర్నీని నిష్పక్షపాతంగా రెఫరీ విధులు నిర్వహించిన భవానీ చంద్‌ను కూడా ట్రోఫీ అందజేసి అభినందించారు. జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అభినందించారు.

ఉత్సవాల ఏర్పాట్లు

పూర్తి చేయాలి

సమావేశంలో కమిషనర్‌ టి.వెంకన్న

వరంగల్‌ అర్బన్‌: గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లు ఈనెల 13వ తేదీలోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్‌ టి.వెంకన్న ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై వినాయక చవితి, ప్రతిమల నిమజ్జన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. వినాయక విగ్రహాల తరలింపులో ఇబ్బందులు కల్గకుండా రోడ్లపై గుంతలు పూడ్చాలని, ప్యాచ్‌వర్క్‌లు పూర్తి చేయాలన్నారు. మండపాల వద్ద ప్రత్యేక డస్ట్‌ బిన్లు ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూ, మత్స్య శాఖ సిబ్బంది బోట్లతో సిద్ధంగా ఉండాలని కమిషనర్‌ సూచించారు. సమావేశంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్‌, జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్‌లింగం, ముఖ్య హార్టికల్చర్‌ అధికారి లక్ష్మారెడ్డి, సిటీప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, కార్యదర్శి అనిల్‌కుమార్‌, ఆరోగ్య అధికారి డాక్టర్‌ రాజేశ్‌, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement