న్యూశాయంపేట: కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే ప్రజా వాణికి వినతులు తగ్గుతున్నాయి. ప్రజలు రాకపోవడంతో అర్జీల విభా గం వెలవెలబోయింది. గతంలో ప్రజావాణికి 200పైగా దరఖాస్తుదా రులతో కలెక్టరేట్ ప్రాంగణం కిటకిటలాడేది. కానీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి తక్కువ సంఖ్య లో బాధితులు రావడంతో ప్రజావాణి సమావేశపు హాల్ ఖాళీగా దర్శనమిచ్చింది. ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ డివి జన్ స్థాయి, మండలస్థాయిలో కూడా ప్రజావాణి నిర్వహిస్తుండటంతో కలెక్టరేట్‌కు ఫిర్యాదులు అందించేందుకు రాలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. పైగా ప్రస్తుత వ్యవసాయ పనులతో హా జరుశాతం తగ్గొచ్చంటున్నారు. హాజరైన కొద్దిమంది బాధితుల నుంచి జిల్లా అధికారులు వినతులు స్వీకరించి వారి బాధలు విన్నా రు. వీటిలో ఎక్కువ శాతం రెవె న్యూ, భూ సమస్యలు, హౌసింగ్ సంబంధించిన దరఖాస్తు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని కా న్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజావా ణికి 160 దరఖాస్తులు అందాయని అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) కిశోర్‌కుమార్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధి కారులకు ఎండార్స్ చేశారు. అడిషనల్ కలెక్టర్ వైవీ గణేశ్, జెడ్పీసీఈఓ వసంత, డీఆర్‌డీఓ నాగపద్మజా, డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణికి ప్రతీవారం తక్కువగా నమోదవుతున్న ఫిర్యాదులు
సమస్యలు పరిష్కరించకపోవడమే
కారణమా?
గ్రీవెన్స్‌లో 160 దరఖాస్తులు
రెవెన్యూ 54
డీడబ్ల్యూఎంసీ 40
హౌసింగ్ 12
డీఆర్‌డీఓ 11
ఇతర శాఖలకు చెందినవి 43
మొత్తం 160
బాగోగులు చూడటం లేదు..
నా కుమారుడు బాగోగులు చూడకుండా ఒంటరిగా వదిలేశాడు. భార్య చనిపోయింది. జీవనభృతి కోసం డబ్బులు ఇప్పించాలని పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చాను. నా రెండు ఎకరాల భూమిని పట్టా చేసి ఇప్పించండి.
బి.హార్యానాయక్, గోరుగుట్టతండా
వైద్యుల నిర్లక్ష్యంలో ఆపరేషన్ ఫెయిల్ అయింది
పొత్తి కడుపులో నొప్పి రావడంతో ఇటీవల ఎంజీఎంలో చేరాను. చిన్న గడ్డ ఉందని వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ ఫెయిల్ అయి ఆపరేషన్ చేసిన ప్రదేశం నుంచి చీము కారుతుండటంతో అందులో పనిచేసే మరో వైద్యుడు తన సొంత ఆస్పత్రికి రీఫర్ చేశాడు. అక్కడ కూడా ఆపరేషన్ చేయకుండా వదిలేశాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యాను. విచారణ జరిపి నష్టపరిహారం ఇప్పించండి.
ఎల్.రాజేశ్వర్‌రావు, గోవిందాపూర్


