జనగణనలో బీసీల లెక్కలు చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

జనగణనలో బీసీల లెక్కలు చేపట్టాలి

Sep 7 2026 7:33 AM | Updated on Sep 7 2026 7:33 AM

కేయూ క్యాంపస్‌: కేంద్రం చేపట్టబోయే జనగణనలో ఓబీసీ వర్గాలకు ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేసి లెక్కలు చేపట్టాలని బీసీ కుల గణన సాధన సమితి కన్వీనర్‌, కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ మురళీమనోహర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం కేయూలోని దూరవిద్యాకేంద్రంలో ‘జనగణనలో ఓబీసీల కాలమ్‌ ఏర్పాటు’ అంశంపై బీసీ సంఘాలతో, ముఖ్యులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కులగణన సాధన సమితి కన్వీ నర్‌ మురళిమనోహర్‌ మాట్లాడుతూ.. కేంద్రం చేపట్టబోయే జనగణనలో బీసీల జనగణన చేపట్టకపో తే భవిష్యత్‌లో బీసీలు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో విపరీతంగా నష్టపోతారన్నారు. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌, విద్యాసంస్థల్లో సీట్లు, రాజకీయ ప్రాతినిథ్యం దక్కాలంటే కచ్చితమైన లెక్కలు ఉండాలన్నారు. అదే డిమాండ్‌తో ఈనెల 11న హనుమకొండలోని ఏకశిల పార్కువద్ద ప్రత్యేకంగా నిరసన దీక్షలను చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈదీక్షలకు బీసీలంతా తరలిరావా లని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సంఘాల బాధ్యులు డాక్టర్‌ తిరుణహరిశేషు, వేణుగోపాల్‌గౌడ్‌, క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

11న ఏకశిల పార్కు వద్ద నిరసన

బీసీ కులగణన సాధన సమితి

కన్వీనర్‌ మురళీమనోహర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement