సన్నూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంపై కమ్ముకున్న మేఘాలు
ఆకాశమంతా కమ్ముకున్న నీలి మేఘాలు.. మేఘాల చాటున దాక్కున్న సూర్యుడు.. ఆ మేఘాలను తాకుతూ దివ్యంగా వెలిగిపోతున్న ఆలయ గోపురం. ఈ సుందర దృశ్యం రాయపర్తి మండలంలోని సన్నూరులోని పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వర్షం వచ్చే ముందు చల్లని గాలి, గోపురం మీద నుంచి వచ్చే గంటల శబ్ధం, రోడ్డుపై వెళ్తున్న వాహనాల లైట్లు.. అన్నీ కలిపి ఆ ప్రదేశం స్వర్గాన్ని తలపిస్తుంది. ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు, గ్రామస్తులు ప్రత్యేక అనుభూతి పొందారు. ఈ అందమైన దృశ్యం ఆదివారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది. – రాయపర్తి


