‘కుడా’ చైర్‌పర్సన్‌గా బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

‘కుడా’ చైర్‌పర్సన్‌గా బాధ్యతల స్వీకరణ

Sep 6 2026 2:19 AM | Updated on Sep 6 2026 2:19 AM

ఆదివారం శ్రీ 6 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

నయీంనగర్‌: కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి శనివారం హనుమకొండ ‘కుడా’ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. వరంగల్‌ పశ్చిమ, ఘన్‌పూర్‌, వర్ధన్నపేట, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్‌.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్‌, ‘కుడా’ వైస్‌ చైర్‌పర్సన్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ వెంకన్న, కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, తదితరుల సమక్షంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా సుధారాణి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, బీసీల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కృషి చేస్తానన్నారు. కుడా పరిధిలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. కాగా, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ పాల్గొనలేదు.

సీఎం రేవంత్‌రెడ్డి బీసీల

పక్షపాతి: గుండు సుధారాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement