– ములుగు | - | Sakshi
Sakshi News home page

– ములుగు

Sep 6 2026 2:19 AM | Updated on Sep 6 2026 2:19 AM

తొలి స్మారక చిహ్నంగా శివ తారకేశ్వరస్వామి గుడి

యునెస్కో గుర్తింపుతో రామప్ప కళ నలుదిశలా పరివ్యాప్తి చెందింది. ఇక్కడి కట్టడాలను చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అదే తరహాలో గత నెలలో రామప్ప సమీపంలోని గొల్లాల గుడిని, జూలైలో శివ తారకేశ్వరాలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈనేపథ్యంలో రామప్పకు మరింత పర్యాటక శోభ సంతరించుకోనుంది. ఈ ప్రాంతం సైతం అభివృద్ధి చెందనుంది. ఈనేపథ్యంలో పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లిన ఈ రెండు ఆలయాల ప్రత్యేకతలే ‘సాక్షి’ సండే స్పెషల్‌..

శివ తారకేశ్వరస్వామి(శివాలయం) ఆలయాన్ని జాతీయ ప్రాముఖ్యత స్మారక చిహ్నంగా గుర్తిసూ గత జూలై 6న భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్‌ఐ) సంస్కృతి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. ఇందులోనూ కాకతీయ కట్టడాల నిర్మాణశైలి ఉంటుంది. కాగా, ప్రస్తుతం ఈ ఆలయంలో కొంతభాగం కూలిపోగా, ఇనుపస్తంభాలు పెట్టి నిలబెట్టారు. కాకతీయుల కాలపు నిర్మాణ చాతుర్యాన్ని ప్రదర్శించే రామప్పలోని 10 ఉప ఆలయాలను కూడా జాతీయ సంపదగా గుర్తించాలని పర్యాటకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement