నడక నేర్పే నాన్న.. నడవడిక నేర్పే చదువు.. పలుకు నేర్పే అమ్మ. పలుకుబడినిచ్చే సమాజం. అజ్ఞానం నుంచి అందరూ కీర్తించేలా మార్చే దిక్సూచి.. నాలుగు గోడల నడుమ భవిష్యత్‌ను తీర్చిదిద్దే నిర్మాత.. చాక్‌పీస్‌ ముక్కలతో తలరాతను మార్చే ఆధునిక బ్రహ్మ అన్నీ ఉపాధ్యాయుడే. ఉమ్ | - | Sakshi
Sakshi News home page

నడక నేర్పే నాన్న.. నడవడిక నేర్పే చదువు.. పలుకు నేర్పే అమ్మ. పలుకుబడినిచ్చే సమాజం. అజ్ఞానం నుంచి అందరూ కీర్తించేలా మార్చే దిక్సూచి.. నాలుగు గోడల నడుమ భవిష్యత్‌ను తీర్చిదిద్దే నిర్మాత.. చాక్‌పీస్‌ ముక్కలతో తలరాతను మార్చే ఆధునిక బ్రహ్మ అన్నీ ఉపాధ్యాయుడే. ఉమ్

Sep 5 2026 7:37 AM | Updated on Sep 5 2026 7:37 AM

సాంకేతికత మేళవిస్తూ.. బడికి రాకపోతే ఇంటికెళ్లి తీసుకొస్తారు..

బోధనలో ప్రత్యేకం.. పిల్లలతో మమేకం

విద్యార్థులతో ప్రయోగం చేయిస్తున్న ఉపాధ్యాయుడు రామ సంతోశ్‌ కుమార్‌

విద్యార్థులు తయారు చేసిన కృత్యాధార

చిత్రాలతో ఉపాధ్యాయుడు రవి

కృత్యాధార బోధన.. సామర్థ్యాల సాధన

మహబూబాబాద్‌ రూరల్‌: విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి పాఠ్యాంశంలోని విషయాలను అర్థం చేసుకుని సామర్థ్యాలను సాధించేలా విద్యా బోధన చేస్తున్నారు మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఆవునూరి రవి. 14 ఏళ్లుగా ప్రయోగాత్మక కృత్యాధార బోధన చేస్తున్నారు. కృత్యాధార బోధనతో విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఇష్టం పెంచుతున్నారు.

నల్లబెల్లి: వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం జెడ్పీఎస్‌ఎస్‌లో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రామ సంతోశ్‌ కుమార్‌ బోధనలో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. పదో తరగతి విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఆయన నిత్యం ఉదయం 5 గంటలకే జూమ్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపు 50 పాఠ్యంశాల వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్‌, సైన్స్‌ఫేర్‌ గైడ్‌ టీచర్‌గా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచేందుకు ఇస్రో శాస్త్రవేత్తలతో అతిథి ఉపన్యాసాలు నిర్వహించారు. ఎన్‌సీఈఆర్టీ నిర్వహించే ఆన్‌లైన్‌ పోర్టల్‌ కోసం ఈ–కంటెంట్‌ రూపొందించి 40కి పైగా వీడియోలు అందించారు. మన టీవీలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పాఠ్యాంశాలు బోధించారు.

ఏటూరునాగారం: ములుగు మండలం జంగాలపల్లి క్రాస్‌కు చెందిన పోతు రాజశేఖర్‌ ఏటూరునాగారం నార్త్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన ఆ పాఠశాలలో చేరినప్పుడు విద్యార్థుల సంఖ్య 90 మాత్రమే. ప్రస్తుతం 170 మందికి చేరింది. దాతల సహకారంతో పాఠశాలలో నూతనంగా కంప్యూటర్‌ ల్యాబ్‌, రేకుల షెడ్డు, ప్రొజెక్టర్‌, టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టారు. పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తక పఠనంపై మక్కువ పెంచుతున్నారు. ఇప్పటికీ ఏ విద్యార్థి బడికి రాకపోయినా ఇంటికి వెళ్లి బండిమీద పాఠశాలకు తీసుకొస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో పలువురు

ఉపాధ్యాయుల అంకితభావం

విద్యార్థుల నమోదు పెంపు..

అకుంఠిత దీక్షతో విధులు

ఆదర్శంగా నిలుస్తూ బడులను

కాపాడుతున్న టీచర్లు

నేడు జాతీయ

ఉపాధ్యాయ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement