సీఎంపై నోరు జారితే ఊరుకునే ప్రసక్తే లేదు : ‘కుడా’ చైర్‌పర్సన్‌ | - | Sakshi
Sakshi News home page

సీఎంపై నోరు జారితే ఊరుకునే ప్రసక్తే లేదు : ‘కుడా’ చైర్‌పర్సన్‌

Sep 5 2026 7:37 AM | Updated on Sep 5 2026 7:37 AM

వరంగల్‌ అర్బన్‌/నయీంనగర్‌ : సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎవరైనా నోరు జారితే ఊరుకునే ప్రసక్తే లేదని కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి హెచ్చరించారు. శుక్రవారం వరంగల్‌లో ఆమె మీడియోతో కొద్దిసేపు ముచ్చటించారు. పార్టీ ఆదేశాలను ధిక్కరించడంతోనే అధిష్టానం మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్‌ చేశారన్నారు. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పార్టీ వరంగల్‌ జిల్లా నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా సుధారాణి హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రాంరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. కాగా, హనుమకొండలోని కుడా కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement