‘కొండా’ అనుచరవర్గంలో మౌనం | - | Sakshi
Sakshi News home page

‘కొండా’ అనుచరవర్గంలో మౌనం

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

‘కొండా’ అనుచరవర్గంలో మౌనం

తాజా పరిణామాల తర్వాత కొండా సురేఖకు మద్దతుగా ఉండే నాయకులు, కార్యకర్తల నుంచి పెద్దగా బహిరంగ ప్రకటనలు కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీన్ని మొత్తం అనుచరవర్గం మౌనంగా ఉందని చెప్పడం కంటే.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరిస్తున్న వాతావరణంగా చూడాల్సి ఉంటుందన్న వాదన వినిపిస్తోంది. కొండా సురేఖ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆమె అనుచరుల రాజకీయ వైఖరి కూడా పార్టీ నిర్ణయాలకు అనుగుణంగానే ఉండే అవకాశముంది. భవి ష్యత్తులో ఏదైనా కీలక రాజకీయ నిర్ణయం వస్తే.. స్థానికంగా ఆమె వెంట ఎవరెవరు నిలు స్తారన్నది అప్పుడే స్పష్టం కానుంది. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కొండా సురేఖకు ఇప్పుడు ప్రధాన సవాలు పార్టీ బయట కంటే సొంత పార్టీలోనే తన రాజకీయ స్థానాన్ని నిలబెట్టుకోవడమే. కాంగ్రెస్‌లోనే ఉంటూ రాజకీయ బలాన్ని పునర్నిర్మించుకోవడమా? పార్టీలోని విభేదాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడమా? తూర్పులో తన కేడర్‌ను మరింత బలోపేతం చేసుకోవడమా? వీటిలో ఏ మార్గాన్ని ఎంచుకుంటారన్నది వారి తదుపరి రాజకీయ చర్యలతోనే స్పష్టం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement