సీఎం రేవంత్‌ను బర్తరఫ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌ను బర్తరఫ్‌ చేయాలి

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

సీఎం రేవంత్‌ను బర్తరఫ్‌ చేయాలి

హన్మకొండ: సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న, వారి ఇళ్లను కూల్చేస్తున్నందుకు, ఎన్నికల హామీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్‌రెడ్డిని పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నిరసనగా ధర్నా, వంటవార్పు కార్యక్రమం నిర్వహించారు. సహపంక్తి భోజనం చేశారు. ఈసందర్భంగా వినయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యిందని సంబరాలు చేసుకునే ముందు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. హామీల అమలుకు ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మర్రి యాదవరెడ్డి, జోరిక రమేశ్‌, పోలెపల్లి రామ్మూర్తి, నయీముద్దీన్‌, రంగారెడ్డి, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

ప్రజల కన్నీళ్లపై

కాంగ్రెస్‌ సంబరాలా?

మాజీ ఎమ్మెల్యే

దాస్యం వినయ్‌ భాస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement