ఇక లెక్క పక్కా! | - | Sakshi
Sakshi News home page

ఇక లెక్క పక్కా!

Aug 27 2026 1:36 AM | Updated on Aug 27 2026 1:36 AM

బోనస్‌కు ఎవరు అర్హులంటే..

రైతులు నమోదు చేయించుకోవాలి..

హన్మకొండ: సన్న రకం వరి వంగడాల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సన్నరకాలు సాగు చేసిన రైతుల వివరాలు, సాగు విస్తీర్ణం పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంది. ఈక్రమంలో వానాకాలం సాగు నుంచి విత్తనాల కొనుగోలు, నారు పోసుకునే, నాటు వేస్తున్న సమయంలో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాల వరి సాగు చేసే రైతులకు క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్‌ అందిస్తోంది. ఈక్రమంలో ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రాధాన్య సన్న రకాలను సాగు చేయాలని, ఆ వివరాలను వ్యవసాయ శాఖ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ లేదా ఈ–క్రాప్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. విత్తనాలు కొనుగోలు చేసిన రైతుల వివరాలు, సాగు విస్తీర్ణం వివరాలను ఆనన్‌లైన్‌లో నమోదు చేయడం తప్పనిసరి చేసింది.

నమోదు తప్పనిసరి..

విత్తనాలు విక్రయించిన క్రమంలో సంబంధిత డీలర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం డీలర్లకు లాగిన్‌ సౌకర్యం కల్పించింది. సొంతగా విత్తనోత్పత్తి చేసి సాగు చేసిన రైతులు, తెలిసిన వారి నుంచి సేకరించి సాగు చేసిన వారు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, ఇతర మార్గాల్లో సన్న రకాల వరి వంగడాలు సేకరించి వరి సాగు చేస్తున్న రైతులకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కల్పించింది. సన్న రకాల వరి సాగు చేసిన రైతులు సంబంధిత వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ)ని కలిసి ఫోన్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌, సాగు వివరాలు అందించి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం సెప్టెంబర్‌ 10వ తేదీ వరకు గడువు విధించింది.

ఆన్‌లైన్‌తో వివరాలు సరిపోలితేనే బోనస్‌ చెల్లిస్తారు.

ఆన్‌లైన్‌ నమోదు ద్వారా దుర్వినియోగం కాకుండా రైతులు బోనస్‌ పొందడానికి మార్గం సులువవుతుంది.

ప్రభుత్వం నిర్దేశించిన ప్రత్యేక సన్నరకాల వరి వంగడాలను మాత్రమే సాగు చేయాలి.

బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, హెచ్‌ఎంటీ సోనా, జై శ్రీరాం, కెఎన్‌ఎం 7715, కెఎన్‌ఎం 1638, డబ్ల్యుజిఎల్‌44 వరి విత్తనాలు సాగు చేసుకున్న రైతులు వివరాలు నమోదు చేసుకుంటే బోనస్‌ పొందడానికి అర్హులవుతారు.

పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యం అమ్ముకునే సమయంలో ఆన్‌లైన్‌లో ఏ విత్తనం సాగు చేశాలో సరి చూసుచూస్తారు.

సన్నాల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

విత్తన కొనుగోలు నుంచే ఆన్‌లైన్‌లో నమోదు

సొంత విత్తనాలు సాగు చేసిన రైతుల వివరాల నమోదుకు అవకాశం

వచ్చేనెల 10లోపు ఆన్‌లైన్‌ చేయించుకోవాలి

నమోదు కాని రైతులకు బోనస్‌ లేనట్లే!

వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం

సన్న రకం వరి వంగడాలు సాగు చేసిన రైతులు తమ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలి. డీలర్ల వద్ద కాకుండా ఇతర మార్గాల్లో సన్న రకం విత్తనాలు సేకరించి వరి సాగు చేసిన ప్రతీ రైతులు వ్యవసాయ విస్తరణాధికారులను కలిసి త్వరగా.. వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రభుత్వం రైతు వారీగా వివరాలు సేకరిస్తోంది. వచ్చే నెల 10వ తేదీలోపు నమోదు పూర్తి చేయాలి. ఈఅవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – వి.విజయ్‌ చంద్ర, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement