పాపన్నగౌడ్‌ జీవితం ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

పాపన్నగౌడ్‌ జీవితం ఆదర్శం

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

న్యూశాయంపేట: సర్ధార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ జీ వితం అందరికీ ఆదర్శమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్‌ నాగరాజు, కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో పాపన్నగౌడ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బహుజనుల కోసం పాలకుల ను ఎదురించి స్వరాజ్యాన్ని స్థాపించి ప్రజలకు సేవచేశారన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ. గణేశ్‌, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, బీసీ సంక్షేమశాఖ అధికారి పుష్పలత, గౌడ సంఘం నాయకులు రాజుగౌడ్‌, రమేశ్‌, లక్ష్మినారాయణ, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే నాగరా జు సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పెండింగ్‌ పనులపై అధికారులతో చర్చించారు. పనులు వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు.

ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు,

కలెక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement