వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

వేధిస్తున్న రెగ్యులర్‌ అధ్యాపకుల కొరత

– 8లోu

బుధవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2026
పాకాల సరస్సు నుంచి సాగునీరు అందించాలి

రాఖీ బంధానికి తపాలా తోడు

దూర ప్రాంతాల్లో ఉన్న సోదరులకు రాఖీలు పంపించే వారికి తపాలా శాఖ ప్రత్యేక రాయితీ ప్రకటించింది.

ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ అటానమస్‌, గురుకుల

డిగ్రీకళాశాలలు

241

పీజీ కళాశాలలు

62

ఫార్మసీ 24

ఇంజనీరింగ్‌

06

బీఈడీ 43

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌

03

ఎంసీఏ 10

ఎంబీఏ 22

హోటల్‌

మేనేజ్‌మెంట్‌

03

లా 04

కేయూ పరిధిలోని

కొత్తగూడెం ఇంజ నీరింగ్‌ కళాశాలను డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ యూనివర్సిటీగా మార్చారు.

కేయూ క్యాంపస్‌:

కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవ శోభ సంతరించుకుంది. నిత్య చైతన్య దీప్తిగా ఉంటూ లక్షాలాది మంది విద్యార్థులను అక్షర దివిటీలుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఈ యూనివర్సిటీది. సామాజిక ఉద్యమాలు, పోరాటాల గడ్డగా పేరొందింది. బుధవారంతో యూనివర్సిటీ 50 వసంతాలు పూర్తి చేసుకొని (గోల్డెన్‌ జూబ్లీ) 51 వసంతంలోకి అడుగిడుతోంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ప్రస్థానంతోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలపై ప్రత్యేక కథనం.

కేయూ తొలుత పీజీ సెంటర్‌గా

తొలుత ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్‌గా 1968లో మొదలైంది. నాడు పోరాటాల ఫలితంగానే 1976, ఆగస్టు 19న కాకతీయ యూనివర్సిటీగా ఆవిర్భవించింది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ 50 వసంతాల్లో ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించి వివిధ రంగాల్లో, దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. ఇక్కడే ఆచార్యులు అయినవారూ ఉన్నా రు. మొదట కేయూ నాలుగు విభాగాలతో మొదలై నాడు రేకుల షెడ్లలోనే విద్య కొనసాగింది. అంచెలంచెలుగా ఎదిగి 29 విభాగాలతో కొనసాగుతోంది. ప్రస్తుతం కేయూలోని అన్ని కాలేజీల్లో 1.20 లక్షలమందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు.

కేయూలో వివిధ సెంటర్లు

కాకతీయ యూనివర్సిటీలో అంబేడ్కర్‌ స్టడీస్‌ సెంటర్‌, స్టూడెంట్‌ వెల్ఫేర్‌, ఎస్సీ, ఎీస్టీ సెల్‌, బీసీసెల్‌, దివ్యాంగసెల్‌, మహిళా అధ్యయన కేంద్రం, యోగా సెంటర్‌ ఉన్నాయి. వీటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. విద్యతోపాటు జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డిగ్రీ, జూనియర్‌, పీజీ కళాశాలల్లో కలిపి 360 ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్లు ఉండగా అందులో 36వేల మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ఉన్నారు. రక్తదానంలో అనేక అవార్డులు పొందింది. స్పోర్ట్స్‌బోర్డు కూడా ఉంది. ప్రతీఏటా సౌత్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ, ఆల్‌ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీల వివిధ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చి పంపిస్తున్నారు.

నిధులు మంజూరుపై ఆశలు

యూనివర్సిటీ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంటు న్న వేళ.. మౌలిక సదుపాయల కల్పనకు రూ.400 కోట్ల నిధుల కోసం వీసీ ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆనిధులు మంజూరు చేస్తే యూనివర్సిటీలో గోల్డెన్‌ జూబ్లీ, యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌ సైన్స్‌కళాశాల శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే యోచనలో ఉన్నారు.

గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు

తొలుత ఓయూ పీజీ సెంటర్‌గా ఆ తరువాత కేయూ

నాలుగు విభాగాలతో మొదలై నేడు 29 విభాగాలు

యూనివర్సిటీ అభివృద్ధికి

రూ.400కోట్లతో ప్రతిపాదనలు

కేయూ పరిధిలోని కాలేజీలు

కాకతీయ యూనివర్సిటీకి 50 వసంతాలు పూర్తి

కేయూలో 332 అధ్యాపక పోస్టులు ఖాళీ

బోధన, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం

విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు ఏవీ?

స్వర్ణోత్సవం భవిష్యత్‌కు బలమైన పునాది

కాకతీయ యూనివర్సిటీ స్వర్ణోత్సవం గతానికి గర్వకారణం భవిష్యత్‌కు బలమైన పునాది. విద్య, నాణ్యమైన పరిశోధనల దిశగా కృషి చేస్తున్నాం. రూసా ప్రాజెక్టుకింద రూ.60కోట్ల నిధులు రాగా, రూ.35కోట్లతో 42పరిశోధన ప్రాజెక్టులు, రూ.15కోట్లతో కెహబ్‌ అభివృద్ధి చేస్తున్నాం. బీఎస్‌ఎన్‌ఎల్‌కు సంబంధించి అండర్‌గ్రౌండ్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ ప్రాజెక్టు పూర్తయింది. అకడమిక్‌ బ్లాక్‌లు, వర్క్‌షాప్‌లు,సెమినార్‌ హాల్స్‌, స్వర్ణోత్సవ శతాబ్ది పైలాన్‌ తదితర పనులకు ఆమోదం లభించింది. రూ.400లకోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. 50 ఏళ్ల విద్యాప్రస్థానాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్తాం.

– కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement