● ఇబ్బందుల్లో రోగులు
నర్సంపేట రూరల్: తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్‌లోని ఎక్స్–రే మిషన్ మొరాయించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రోజురోజుకూ రోగుల తాకిడి గణనీయంగా పెరుగు తూ వస్తోంది. ప్రతీ రోజు ఓపీ 700 నుంచి 900 వర కు వస్తున్నారు. అయితే గత మూడు నెలలుగా ఆస్పత్రిలో ఉన్న ఎక్స్–రే మిషన్ మరమ్మతుకు గురైంది. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యసేవలు అందించాలనే ఉద్దేశ్యంతో పాత ఆస్పత్రి వద్ద ఉన్న తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్‌లోని ఎక్స్–రే మిషన్‌తో సేవలు అందిస్తూ వచ్చారు. మంగళవారం హబ్‌లోని ఎక్స్–రే మిషన్ కూడా మరమ్మతుకు గురికావడంతో రోగులకు తిప్పలు తప్పలేదు. ఇప్పటికే రోగులు కొత్త ఆస్పత్రి, పాత ఆస్పత్రికి ఎక్స్–రే కోసం ఆటోలో తిరుగుతూ ఒక్కొక్కరికి రూ.100 వరకు ఖర్చు చేసుకుంటున్నారు. ఇప్పడు ఉన్న ఒక ఎక్స్–రే మిషన్ మరమ్మతుకు గురికావడంతో రోగులకు ప్రైవేట్ ఆస్పత్రి, ఎంజీఎంకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కలెక్టర్ కొనుగోలు చేసిన మొబైల్ ఎక్స్‌రే కూడా ఇన్‌స్టాలేషన్ కాలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఎక్స్–రే మిషన్ మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని, నూతన ఎక్స్–రే మిషన్ కూడా ఇన్‌స్టాలేషన్ చేసి, స్టెప్లజర్‌ను కొనుగోలు చేసి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.


