సాక్షి, వరంగల్: నర్సంపేట నియోజకవర్గంలో పెద్ద దుమారం చెలరేగింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం అనంతరం పట్టణంలోని జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల ఎదురుగా ప్రతిష్ఠించిన విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు సోమవారం అర్ధరాత్రి తొలగించడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం విగ్రహ తొలగింపు వార్త నియోజకవర్గంలోని నర్సంపేట, దు గ్గొండి, ఖానాపురం, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లోని బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజలకు తెలియడంతో చాలా చోట్ల ముందుగానే ముఖ్యనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు అన్ని వైపులా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసి పోలీసు పహారా పెంచారు. ముఖ్యంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లి మండలంలో ఖాకీలమయం కావడంతో అందరి దృష్టి న ర్సంపేట వైపు అటెన్షన్ నెలకొంది. ఇంకోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు మంగళవారం కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయా ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేసి హంగామా చేశారు. నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు కూడా పోలీసు పహారాలోకి వెళ్లింది. మరోవైపు బీఆర్‌ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే దొంతి దిష్టిబొమ్మలు ద హనం చేశారు. ఇలా ఒకేరోజు అటు వైపు పెద్ది విగ్రహ తొలగింపు నిరసనలు, ఇటు వైపు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలతో నర్సంపేటలో విచిత్ర రాజకీ య వాతావరణం నెలకొంది.
500 మంది పోలీసులతో బందోబస్తు
ఒక్క నర్సంపేటలోనే ఏఆర్, మామునూరు నాలు గో బెటాలియన్, ఇతర పోలీస్‌స్టేషన్‌ల నుంచి సుమారు 500 మంది వరకు పోలీసులు మకాం వేయడంతో హైటెన్షన్ వాతావారణం ఉంది. ఇప్పటికే పెద్ది దశ దినకర్మ ముందు పెద్ది విగ్రహ ప్రతిష్ఠాపనకు మున్సిపల్ అనుమతి లేదంటూ గద్దెలు తొలగించినా కూడా మళ్లీ విగ్రహ ప్రతిష్ఠాపన చేసిన వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై ఇప్పటికే నర్సంపేట పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఇంకోవైపు నల్లబెల్లిలో పెద్ది భార్య స్వప్న ఆయన విగ్రహం వద్ద ‘నువ్వు లేని రోజు చూడు.. ఎంత అరాచకమో’ అంటూ విలపించారు. కుటుంబం గురించి కాకుండా ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించిన వ్యక్తి విగ్రహం తొలగించడం తట్టుకోలేక పోతున్నామని ఆమె భావోద్వేగ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పెద్ది విగ్రహ తొలగింపుపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ భూ యజమాని విద్యాసాగర్‌రావు అనుమతితోనే పెద్ది విగ్రహం ఏర్పాటు చేస్తే కూల్చేందుకు కాంగ్రెస్‌కు సిగ్గుండాలి. అదే స్థానంలో పెద్ది విగ్రహం ఏర్పాటు చేయకపోతే తీవ్ర పరి ణామాలు ఉంటాయని హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో హెచ్చరించడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఉంది. కాగా పెద్ది విగ్రహ తొలగింపుపై నేడు (బుధవారం) బీఆర్‌ఎస్ నాయకులు నర్సంపేట బంద్‌కు పిలుపునిచ్చారు.
పట్టణంలో మాజీ ఎమ్మెల్యే
పెద్ది విగ్రహం తొలగింపుతో ఉద్రిక్తత
నియోజకవర్గ వ్యాప్తంగా
బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన, అరెస్టులు
ఇంకోవైపు ఎమ్మెల్యే
దొంతి జన్మదిన వేడుకలతో హైటెన్షన్


