అధిక సాంద్రత పత్తి సాగుతో లాభాలు | - | Sakshi
Sakshi News home page

అధిక సాంద్రత పత్తి సాగుతో లాభాలు

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

దుగ్గొండి: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల దిగుబడి పెరిగి అధిక లాభాలు వస్తాయని కేవీకే ప్రధాన శాస్త్రవేత్త రాజుకుమార్‌ అన్నారు. మండలంలోని మహ్మదాపురం గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో పాలడుగుల రాజు పత్తి పంటలో మంగళవారం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రాజుకుమార్‌ మాట్లాడారు. ప్రత్తిలో తెగుళ్లు, చీడపీడల ఉధృతిని గమనించడానికి ఎకరాకు 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెల్లదోమ, పచ్చదోమ నివారణకు ఎకరానికి 20 నుంచి 25 పసుపు, నీలి రంగులు అట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పేనుబంక, పచ్చదోమ నివారణకు లీటరు నీటికి 0.3 గ్రాముల ప్రోమికామిడ్‌, లేదా లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్‌ మందును కలిపి పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్యామ్‌, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, ఐఎఫ్‌సీపీ మేనేజర్‌ విశాల్‌, ఏఈఓలు విజయ్‌, హనుమంతు, భారతి, వైజయంతి, సర్పంచ్‌ శ్రీనివాసరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement