సంగెం: సంక్రమిత వ్యాధులను వ్యాప్తింపజేసే దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని జాతీయ సంక్రమిత వ్యాధి నియంత్రణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అరుణ్‌జోషి సూచించారు. మంగళవారం ఆర్‌ఎఫ్‌డబ్ల్యూసీ (రూరల్ ఫ్యామిటీ వెల్ఫేర్ సెంటర్) రూరల్ కుటుంబ సంక్షేమ కేంద్రాన్ని సందర్శించి రికార్డులు తనిఖీ చేసి ఆస్పత్రిలో చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలుసుకుని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని, నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. జ్వరం, దగ్గు ఇతర అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రజలకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం, నివారణ చర్యలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రోగ్రాం అధికారి డాక్టర్ అరుణ్‌జోషి


