పిల్లల భద్రత, ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

పిల్లల భద్రత, ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

పిల్లల భద్రత, ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి

అదనపు కలెక్టర్‌ రవి

హన్మకొండ అర్బన్‌ : బాలల సంరక్షణ కేంద్రాల్లో పిల్లల భద్రత, సంక్షేమం, ఆరోగ్యం, విద్య, వసతి, ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రవి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా తనిఖీ కమిటీ సమావేశం జరిగింది. గత త్రైమాసిక తనిఖీల్లో గుర్తించిన లోపాలు, సూచనలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించి తీసుకున్న చర్యల నివేదికలను సమర్పించాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, బాలల సంక్షేమ సమితి సభ్యుడు దామోదర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement