పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి

Aug 19 2026 12:42 AM | Updated on Aug 19 2026 12:42 AM

పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి

హన్మకొండ అర్బన్‌: సామాజిక సమానత్వం, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ చేసిన పోరాటాన్ని నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సర్వాయి పాపన్నగౌడ్‌ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, అదనపు కలెక్టర్‌ రవి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుల, మత వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సమాన ప్రాతినిథ్యం కల్పించేందుకు పాపన్న కృషి చేశారని నాగరాజు తెలిపారు. కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మాట్లాడుతూ అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా పాపన్న పోరాడారని గుర్తుచేశారు. కార్యక్రమంలో ‘కుడా’ మాజీ చైర్మన్‌్‌ సుందర్‌రాజ్‌యాదవ్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్‌, ఎకై ్స జ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి

జిల్లా వ్యవసాయాధికారి విజయచంద్ర

పరకాల: ఎల్‌నినో వర్షాభావ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా ప్రత్నామ్నాయ ఆరుతడి పంటలపై దృష్టిసారించాలని జిల్లా వ్యవసాయాధికారి విజయచంద్ర కోరారు. పరకాల మండలం కామారెడ్డిపల్లి రైతువేదికలో రైతులకు ఆరుతడి పంటల సాగు, ఆయిల్‌పామ్‌ సాగు, నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరికి బదులు పెసర, మినుము, కంది వంటి పంటలను సాగు చేయడం ద్వారా తక్కువ నీటితో మంచి దిగుబడులు పొందవచ్చని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి సాగు వ్యయాలను తగ్గించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పరకాల ఏఓ ఎస్‌.శ్రీనివాస్‌, వ్యవసాయ విస్తరణ అధికారి అహ్మద్‌ రజా, గ్రామసర్పంచ్‌ చిర్ర అనిత, ఉప సర్పంచ్‌ శ్రీపతి మౌనిక, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement