నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు

Aug 17 2026 7:35 AM | Updated on Aug 17 2026 7:35 AM

నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు

కాశిబుగ్గ: సమాన హక్కు, సమాన గౌరవం, సమాన స్థాయిలో స్టైఫండ్‌ పెంపు కోసం తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవదిక దీక్షలు ఆదివారంతో 13వ రోజుకు చేరుకున్నాయి. ఈసందర్భంగా అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వద్ద ఆయుష్‌ విద్యార్థులు తమ డిమాండ్ల కోసం నినాదాలు చేస్తూ ఉదయం నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే నేటి (సోమవారం) నుంచి రిలే నిరాహార దీక్షను ప్రారంభిస్తామని ఆయుష్‌ జేఏసీ జాయింట్‌ సెక్రటరీ డాక్టర్‌ రోహిత్‌ బాస్రె పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు రాజేశ్‌, సంగమేశ్వర్‌, సంగీత, ప్రణీత, స్నేహబిందు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement