వెంకటేశ్వరపల్లిలో బోనాలతో మహిళలు
డప్పు చప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు..పోతురాజుల విన్యాసాల నడుమ జిల్లావ్యాప్తంగా ఆదివారం భక్తిశ్రద్ధలతో ప్రజలు బోనాల పండగ నిర్వహించుకున్నారు. భక్తుల కోలాహలంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి, మంగళహారతులు, నైవేద్యాలతో డప్పుచప్పుళ్లతో ఆలయాలకు చేరుకున్నారు. గ్రామదేవతలైన మారెమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. యాటపోతులు, కోళ్లు బలిచ్చారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం కనిపించింది. – రాయపర్తి


