సాక్షి, వరంగల్/హన్మకొండ అర్బన్: నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు, పుట్టిన వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. తక్కువ బరువు, ఇన్‌ఫెక్షన్ లేదా పచ్చ కామెర్లతో అత్యవసర వైద్యం అవసరమున్న పసికందుల ప్రాణాలకు రక్షణగా నిలు స్తోంది 108 నియోనేటల్ అంబులెన్స్. నవజాత శిశువుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నియోనేటల్ అంబులెన్స్ అత్యవసర వేళల్లో కదిలే మొబైల్ ఐసీయూగా పనిచేస్తోంది. 2023 ఆగస్టులో గ్రేటర్ వరంగల్‌లో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పటికి వేల మంది పసికందుల ప్రాణాలు కాపాడాయి. హనుమకొండ ఎంసీహెచ్ ఆస్పత్రిలో 24 గంటలు అందుబాటులో ఉండే ఈ అంబులెన్స్‌లో నియోనేటల్ కేర్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ), పైలట్ విధులు నిర్వహిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణ సమయంలోనే శిశువుకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందిస్తూ నిరంతర వైద్య పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
అత్యవసర పరికరాలతో ఆయుష్షు..
పుట్టిన 28 రోజుల్లోపు శిశువులకు శ్వాస ఆడకపోవడం, తక్కువ బరువు, ఇన్‌ఫెక్షన్లు, పచ్చకామెర్లు తదితర సమస్యలు తలెత్తినప్పుడు ఈ అంబులెన్స్ కీలకంగా మారుతోంది. ఇందులో శిశువు శరీర ఉష్ణోగ్రతను కాపాడే ఇంక్యుబేటర్, శ్వాస అందించేందుకు పిడియాట్రిక్ వెంటిలేటర్, పల్స్, ఆక్సిజన్ స్థాయి, రక్తపోటు, ఉష్ణోగ్రత, ఈసీజీ వంటి వివరాలను నిరంతరం పర్యవేక్షించే మల్టీ పారా మానిటర్ ఉన్నాయి. నవజాత శిశువు గొంతులో శ్వాసమార్గానికి అడ్డుపడిన ముక్కు, నోటిలోని అవాంఛిత స్రావాలను తొలగించేందుకు సెక్షన్ మెషిన్, మందులను కచ్చితమైన మోతాదులో అందించేందుకు సిరంజీ ఇన్ఫ్యూజన్ పంపు వంటి పరికరాలు కూడా అందుబాటులో ఉంటాయి.
మొత్తం2,655
శిశువులు
513
937
1,034
2023 2024 2025 2026
వెంటిలేటర్, శిశువుకు కచ్చితమైన మోతాదులో ఇంజక్షన్ మందులు ఇవ్వడానికి ఉపయోగపడే సిరంజీ ఇన్ఫ్యూజియన్ పంపు
పసికందుల పాలిట సంజీవని
ప్రాణాలు కాపాడుతున్న 108 నియోనేటల్ అంబులెన్స్
ఇప్పటి వరకు 2,655 మంది శిశువులకు ఊపిరి


