ఖిలా వరంగల్: శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తున్న నల్సార్ విద్యార్థులపై చర్య అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ అన్నారు. విద్యార్థుల నిరసనను అడ్డుకోవడానికి బార్ కౌన్సిల్ ఆప్ ఇండియా(బీసీఐ) ఎవరని, విద్యార్థులను లాయర్లుగా నమోదు చేసుకోవద్దని ఆదేశించడం, వారిని బెదిరించడం వంటి చర్యలు పూర్తి అప్రజాస్వామికమని పేర్కొన్నారు. వారం రోజులపాటు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగిన సీపీఐ పాదయాత్ర శుక్రవారం నగరంలోని శివనగర్‌లోని సీసీఐ తమ్మెర భవనంలో ముగిసింది. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ బాష్‌మియా అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడారు. యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆహ్వానించవద్దని విద్యార్థులు వీసీకి విజ్ఞప్తి చేయడం వారి నిరసనలో భాగమని ఆయన పేర్కొన్నారు.
సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ


