హెచ్‌ఐవీ కేసులను నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐవీ కేసులను నమోదు చేయాలి

Aug 15 2026 7:29 AM | Updated on Aug 15 2026 7:29 AM

గీసుకొండ: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో హెచ్‌ఐవీ కేసులను సంబంధిత వైద్యులు, సిబ్బంది రికార్డుల్లో తప్పనిసరిగా నమోదుచేయాలని వరంగల్‌, హనుమకొండ డీఎంహెచ్‌ఓలు డాక్టర్‌ బి.రాజారెడ్డి, డాక్టర్‌ అప్పయ్య అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఎయిడ్స్‌ నివారణ, నియంత్రణ యూనిట్‌ ఏఆర్‌టీ మెడికల్‌ ఆఫీసర్లు, ఐసీటీసీ కౌన్సిలర్లు, ఎన్జీఓ ప్రతినిధులతో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉన్న వారికి ఏఆర్‌టీ, కౌన్సెలింగ్‌, ఇతర వైద్య సేవలను క్రమం తప్పకుండా అందించాలన్నారు. హై రిస్క్‌ ఉన్న వారిని హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌ చేసుకునేలా మోటివేట్‌ చేయాలని కోరారు. ప్రోగాం అధికారులు డాక్టర్‌ మదన్‌మోహన్‌, డాక్టర్‌ అరుణ్‌జోషి, ప్రోగ్రాం మేనేజర్‌ స్వప్నమాధురి, డేటా మేనేజర్‌ కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement