కాశిబుగ్గ: ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి, జ్వర పీడితుల నుంచి రక్త నమూనాలను సేకరించాలని జిల్లా మలేరియా నివారణ అధికారి రజని అన్నారు. దేశాయిపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎంహెచ్ నగర్‌లో ఇటీవల నమోదైన కీటక జనిత వ్యాధుల దృష్టా గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్థానిక మెడికల్ ఆఫీసర్ భరత్‌కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన వైద్య శిబిరాన్ని సందర్శించి ప్రజలకు కీటక జనిత వ్యాధులైన డెంగీ, మలేరియా, చికున్ గన్యా వ్యాధుల నివారణకపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. వైద్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే నిర్వహించాలని, ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రై డే పాటించాలని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కుమారస్వామి, సదానందం, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
జిల్లా మలేరియా నివారణ అధికారి రజని


