పాఠశాలల్లో స్వచ్ఛ పోటీలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో స్వచ్ఛ పోటీలు

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

కాళోజీ సెంటర్‌: పాఠశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ ఏవం హరిత్‌ విద్యాలయ రేటింగ్‌ (ఎస్‌హెచ్‌వీఆర్‌) 2026–27’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగస్వామ్యం కావడం ద్వారా తమ పాఠశాలల స్వచ్ఛతా ప్రమాణాలను జాతీయస్థాయిలో నిరూపించుకునే అవకాశం ఉంటుంది.

పోర్టల్‌, యాప్‌ వేదికగా స్వీయ మూల్యాంకనం..

పాఠశాల విద్యాశాఖ సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ డాక్టర్‌ ఇ.నవీన్‌నికోలస్‌ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. యూడీఐఎస్‌ఈ+ కోడ్‌ ఉన్న అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, గురుకుల పాఠశాలలు 100 శాతం ఈ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొనాలి. https://shvr.education.gov.in, Swachh Evam Harit Vidyalaya Rating మొబైల్‌ యాప్‌ ద్వారా తమ స్వీయ మూల్యాంకనాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆగస్టు ఒకటి నుంచి నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. తుది గడువు ప్రకటించలేదు.

మూల్యాంకన అంశాలు, పాయింట్లు..

పాఠశాలల నిర్వహణ, స్వచ్ఛతా ప్రమాణాలను మొత్తం 6 ప్రధాన విభాగాల ఆధారంగా అంచనా వేస్తారు. తాగునీటి వసతికి 22 మార్కులు, మరుగుదొడ్లకు 27 మార్కులు, సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవడంపై 14 మార్కులు, నిర్వహణ, సంరక్షణకు 21 మార్కులు, ప్రవర్తనా మార్పు – సామర్థ్య పెంపునకు 20 మార్కులు, మిషన్‌ లైఫ్‌ కార్యకలాపాలకు 21 మార్కులు కేటాయిస్తారు. ఆయా విభాగాల్లో పొందిన మార్కుల ఆధారంగా పాఠశాలలకు 1 స్టార్‌ నుంచి 5 స్టార్‌ వరకు జాతీయస్థాయిలో రేటింగ్‌ ఇస్తారు.

గడువులోగా పూర్తిచేయాలి..

డీఈఓ జిల్లా నోడల్‌ ఆఫీసర్‌గా, సమగ్రశిక్ష కోఆర్డినేటర్లు అసిస్టెంట్‌ నోడల్‌ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. రోజువారీ పురోగతిని పర్యవేక్షించి అన్ని పాఠశాలలు 100 శాతం నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సమగ్రశిక్ష కార్యాలయం ఆదేశించింది. పాఠశాలలకు నమోదు ప్రక్రియలో సందేహాలు ఉంటే మార్గదర్శకాలు అందించి నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేయించాలి.

రేటింగ్‌ కోసం పోటీపడాలి..

పాఠశాలల్లో పరిశుభ్రత, పర్యావరణహిత పద్ధతులను ప్రోత్సహించేందుకు రేటింగ్‌ కోసం పోటీపడాలి. పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించేందుకు విద్యార్థులు, ఉపాద్యాయులు, సిబ్బందికి అవగాహన కల్పించాలి. పాఠశాలల పరిశుభ్రత, పచ్చదనం ప్రమాణాల ఆధారంగా స్వచ్ఛ ఏవమ్‌ హరిత విద్యాలయ రేటింగ్‌ (ఎస్‌హెచ్‌వీఆర్‌) ఉంటుంది. స్వచ్ఛభారత్‌, హరితభారత్‌ వంటి జాతీయ లక్ష్యాలపై విద్యార్థుల్లో బాధ్యత పెంచి సమగ్ర పాఠశాల అభివృద్ధి దిశగా కృషి చేసి 5 స్టార్‌ రేటింగ్‌ వచ్చేలా కృషి చేయాలి.

– డాక్టర్‌ కట్ల శ్రీనివాస్‌, జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్‌ ఆఫీసర్‌

మార్కుల ఆధారంగా జాతీయస్థాయిలో రేటింగ్‌

100 శాతం స్కూళ్ల భాగస్వామ్యమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement