రోగులకు పరీక్షే! | - | Sakshi
Sakshi News home page

రోగులకు పరీక్షే!

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

రోగులకు పరీక్షే!

ఎంజీఎంలో సీబీపీ టెస్ట్‌ లేక ప్రైవేట్‌కు పరుగులు

కాశిబుగ్గ: ఎంజీఎం ఆస్పత్రిలో సాధారణంగా చేయించుకునే బ్లడ్‌ గ్రూపింగ్‌ టెస్ట్‌ లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర విభాగంతో పాటు సెంట్రల్‌ ల్యాబ్‌లో ఈ పరీక్ష అందుబాటులో లేకపోవడంతో పేషెంట్లకు ఇబ్బందులు తప్ప డం లేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సర్జరీ చేయాలన్నా, రక్తం ఎక్కించాలన్నా బ్లడ్‌ గ్రూప్‌ తెలుసుకోవడం ముఖ్యం. ఈ గ్రూపు తెలుసుకోవడానికి అవసరమైన సిరాస్‌ లేకపోవడం వల్ల టెస్ట్‌లు చేయడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక పేషంట్‌ ఏ రక్త గ్రూపునకు సంబంధించిన వారో తెలుసుకోవడానికి యాంటీ ఏ, యాంటీ బీ, యాంటీ ఓ అందుబాటులో ఉండాలి. ఇందులో ఏమీ లేకపోవడంతో పేషంట్లు ప్రైవేట్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. అయితే, ప్రైవేట్‌గా తీసుకొచ్చిన బ్లడ్‌ గ్రూప్‌ రిపోర్ట్‌ను వైద్యులు అంగీకరించడం లేదని ఆందోళన చెందుతున్నారు. అత్యవసరంగా సర్జరీ చేయాలంటే బ్లడ్‌ గ్రూప్‌ లేకుంటే సర్జరీలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు ఈ పరీక్షలపై ప్రత్యేక చొరవ చూపాలని, కెమికల్స్‌ ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement