శ్రావణం.. నిత్యోత్సవం | - | Sakshi
Sakshi News home page

శ్రావణం.. నిత్యోత్సవం

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

శ్రావణం.. నిత్యోత్సవం

హన్మకొండ కల్చరల్‌: గ్రేటర్‌ వరంగల్‌ పరిధి ఆలయాలకు శ్రావణ శోభ సంతరించుకుంది. నేటి (గురువారం) నుంచి సెప్టెంబర్‌ 11వ తేదీ శుక్రవారం వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు. నగరంలోని వేయిస్తంభాల ఆలయంలో శ్రావణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతీ సోమవారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు, బిల్వార్చానలు, రుద్రాహోమాలు, అన్నపూజలు నిర్వహించనున్నారు. 17న నాగపూజలు, 28న రాఖీ పండుగ, సెప్టెంబర్‌ 9న మాస శివరాత్రిని పురస్కరించుకుని ఉదయం 11గంటలకు రుద్రేశ్వరీరుద్రేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్‌కుమార్‌ తెలిపారు.

క్యూలైన్ల ఏర్పాట్లు

శ్రావణమాసం సందర్భంగా దేవాదాయ శాఖ పరిధి ఆలయాల్లో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రకాళి ఆలయంలో శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా భద్రేశ్వర శివలింగానికి ప్రతీ సోమవారం ప్రత్యేక పూజలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రతీ శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలు, ఒడిబియ్యం సమర్పణలు ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. పద్మాక్షి ఆలయంలో, వరంగల్‌ ఎంజీఎం ఎదురుగా ఉన్న రాజరాజేశ్వరీదేవి దేవాలయంలో, హంటర్‌ రోడ్డులోని సంతోషిమాత ఆలయం, లష్కర్‌బజార్‌లోని సంతోషిమాత ఆలయాల్లో వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. వీటితో పాటు నగరంలోని పలు వేంకటేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, పోచమ్మ దేవాలయాల్లోనూ శ్రావణమాస పూజలు, పండిత ప్రవచనాలు ఏర్పాటు చేయనున్నారు.

నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం

దేవాలయాల్లో ప్రత్యేక పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement