● సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ● పరకాల సబ్‌స్టేషన్ సందర్శన
పరకాల: విద్యుత్ సరఫరాలో నాణ్యతతో పాటు భద్రతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం సాయంత్రం పరకాల పట్టణ సబ్‌స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా సబ్‌స్టేషన్‌లోని ఓఅండ్‌ఎం సిబ్బందితో సమావేశమయ్యారు. విద్యుత్ భద్రతా చర్యలు, నిర్వహణ పనులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్‌మ్యాన్డ్ సబ్‌స్టేషన్లలో విధులు నిర్వహించే సిబ్బందితో కూడా మాట్లాడి, విద్యుత్ పనులు నిర్వర్తించే సమయంలో తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. వినియోగదారులకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు ఉద్యోగుల భద్రతను సమాన ప్రాధాన్యంతో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ టి.మధుసూదన్, హనుమకొండ ఎస్‌ఈ సౌమ్య నాయక్, డీఈ మల్లికార్జున్, ఏడీఏ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


