అటవీశాఖ ఆధీనంలోకి వచ్చిన కాటేజీలను తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధికి వెళ్లనున్నాయి. అటవీశాఖతో కార్పొరేషన్ చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధికారులు నివేదికలు, అంచనాలు తయారు చేసుకొని వెళ్లినట్లు తెలిసింది. కాటేజీల నిర్వహణ కోసం అశోక్‌నగర్‌కు చెందిన పలువురికి శిక్షణ సైతం ఇచ్చినట్లు సమాచారం. కానీ, ప్రస్తుతం కాటేజీలు అందుబాటులోకి తీసుకురావడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సుమారు ఐదు నెలలుగా కాటేజీలు నిరుపయోగంగానే ఉంటున్నాయి. పాకాలకు వచ్చే పర్యాటకులు బసచేయడానికి వీలులేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న దుస్థితి సైతం నెలకొంటుంది. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు, ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు త్వరగా ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటకులు కోరుతున్నారు.


