న్యూశాయంపేట: ఏఐ వినియోగంపై కలెక్టరేట్‌లో బుధవారం అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చాట్ జీపీటీ, గుగూల్ నోట్‌బుక్ కేఎల్‌ఎం, క్లాడ్‌తోపాటు మొత్తం 15 అధునాతన ఏఐ ఆధారిత ఉత్పాదక సాధనాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. అధికారిక లేఖల తయారీ, సమావేశాల మినిట్స్ రూపొందించడం, పత్రాల సంక్షిప్తీకరణ, ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షకులు వాసుదేవన్ నట రాజన్, రాహుల్, ధీరజ్ తదితరులు అధికారులకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ అధికారులు తమ విధుల్లో ఏఐ సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, వరంగల్, నర్సంపేట ఆర్డీ లు సుమ, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.


