ఆటపాటలతోనే అభ్యాసానికి బాట | - | Sakshi
Sakshi News home page

ఆటపాటలతోనే అభ్యాసానికి బాట

Jul 15 2026 12:41 AM | Updated on Jul 15 2026 12:41 AM

కాళోజీ సెంటర్‌/ఖిలా వరంగల్‌: చిన్నారులకు ఆటపాటలు, కథల ద్వారా బోధన అందిస్తేనే నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగి సమగ్ర వికాసం సాధ్యమవుతుందని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. జీపీఎస్‌ కరీమాబాద్‌ పాఠశాలలోని ప్రీప్రైమరీ విభాగంతో పాటు ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరీమాబాద్‌ ప్రీప్రైమరీ తరగతి గదిలో చిన్నారులకు శ్రీప్లే వే మెథడ్‌శ్రీ ద్వారా నిర్వహిస్తున్న బోధన, బోధనా అభ్యాస సామగ్రి వినియోగం, పిల్లల భాగస్వామ్యాన్ని కలెక్టర్‌ నిశితంగా పరిశీలించారు. క్లాస్‌రూమ్‌లోకి వెళ్లి చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థులతో రైమ్స్‌ చెప్పిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రతీ ప్రీప్రైమరీ పాఠశాలలో ఇదే తరహా అభ్యాస వాతావరణాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం కరీమబాద్‌, శంభునిపేట జీహెచ్‌ఎస్‌ పాఠశాలల్లోని కొనసాగుతున్న ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణ అమలవుతున్న తీరును, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తనిఖీలో అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్‌ తేజ, ఉల్లాస్‌ కోఆర్డినేటర్‌ నాగేశ్వర్‌రావు, హెచ్‌ఎం జయప్రకాశ్‌, డీఆర్‌పీలు, సీఆర్‌పీలు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

బీఎల్‌ఓలకు సహకరించాలి

ఖిలా వరంగల్‌: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. మంగళవారం వరంగల్‌ నగరంలోని లెనిన్‌నగర్‌, రంగశాయిపేట ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. ఎస్‌ఐఆర్‌ నమోదు కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. బూత్‌ లెవల్‌ అధికారులకు (బీఎల్‌ఓలు) పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ పరిశీలనలో తహసీల్ధార్‌ ఇక్బాల్‌, ఎంసీపీఐ నగర ప్రధాన కార్యదర్శి మాలోతు సాగర్‌, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement