భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం

Jul 15 2026 12:41 AM | Updated on Jul 15 2026 12:41 AM

భూ సమస్యల పరిష్కారానికి శ్రీకారం

అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి

ఐనవోలు: గ్రామాల్లోని భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి అన్నారు. మంగళవారం మండలంలోని పంథినిలో భూముల రీ సర్వే అవగాహన కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా రవి మాట్లాడుతూ.. తెలంగాణలో 90 ఏళ్ల క్రితం భూముల సర్వే జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం భూముల రీ సర్వే కార్యక్రమం చేపడుతోందని, రైతులు సహకరించాలని కోరారు. ఆధునిక సాంకేతిక పరికరాల ద్వారా పారదర్శకంగా సర్వే చేయనున్నట్లు, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్వే పూర్తయిన వెంటనే ప్రతీ భూమికి భూధార్‌ కార్డులు అందజేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. మండలంలో పంథిని గ్రామం పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికై నట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీరాం భూపాల్‌రావు, తహసీల్దార్‌ విక్రమ్‌కుమార్‌, సర్వే ఏడీ నూర్‌సింగ్‌, డీఐ సారంగపాణి, సర్వేయర్‌ సూరజ్‌కుమార్‌, జీపీఓ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement