కాశిబుగ్గ: నులి పురుగుల నివారణకు కృషి చే యాలని, పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి ఆ ల్బెండజోల్ మాత్రలు ఉపయోగపడతాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం సీకేఎం కళాశాల ఆవరణలోని దేశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మాత్రల పంపిణీని కలెక్టర్ డా క్టర్ సత్యశారదతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అంది స్తున్న మాత్రలతో పిల్లల్లో ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఐ.ప్రకాశ్, ప్రో గ్రాం అధికారి డాక్టర్ సాజితాబేగం, డీఈఓ రంగయ్యనాయుడు, ఎంఈఓ వెంకటేశ్వర్‌రావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భరత్‌కుమార్, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్న, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, హెచ్‌ఎంలు రాజేష్, ఉష తదితరులు పాల్గొన్నారు. కాగా సోమవారం 1,83,038 మంది పిల్లలకు (93.26 శాతం) ఆల్బెండజోల్ మాత్రలను వేసినట్లు డీఎంహెచ్‌ఓ ప్రకాశ్ తెలిపారు. మిగిలిన పిల్ల లకు ఈ నెల 20న వేస్తామన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి సురేఖ


