న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులతోపా టు పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించి త్వరగా పరిష్కరించాలన్నారు. మొత్తం 191 దరఖాస్తులు రాగా రెవెన్యూ 65, మున్సిపల్ 10, హౌసింగ్ 44, ఇతర శాఖలకు సంబంధించినవి 72 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ప్రజావాణిలో 191 దరఖాస్తులు


