సకాలంలో జీఎస్టీ చెల్లించినందుకు
ప్రశంసపత్రం
భీమదేవరపల్లి: ములుకనూరు మహిళా సహకార డెయిరీని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సకాలంలో జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయడంతో పాటు పన్నులను సక్రమంగా చెల్లించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) ప్రత్యేక ప్రశంసపత్రాన్ని జారీ చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ములుకనూరు మహిళా డెయిరీ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసిస్తూ సీబీఐసీ చైర్మన్ వివేక్ చతుర్వేది సంతకంతో కూడిన ప్రశంసపత్రాన్ని అందజేశారు. అరుదైన గౌరవం పొందిన సందర్భంగా డెయిరీ అధ్యక్షురాలు ధనశ్రీ, జనరల్ మేనేజర్ భాస్కర్‌రెడ్డి పాలకవర్గం, సిబ్బంది, సభ్యులను అభినందించారు.


