విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి

Jul 11 2026 6:49 AM | Updated on Jul 11 2026 6:49 AM

నర్సంపేట: ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా వ్యాపారాన్ని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ఏఐ ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు దిడ్డి పార్థసారధి, పీడీఎస్‌ యూ జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్‌, జిల్లా సహా య కార్యదర్శి అనువాల నరేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నా యకుడు రవీందర్‌లు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు నర్సంపేట డివిజన్‌లోని ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బంద్‌ శుక్రవారం విజయవంతమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించాలనే ఆలోచనను మానుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్‌, పాఠ్య పుస్తకాలు అందించాలని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి అక్షయ పాత్ర, ఇస్కాన్‌, మన్నా సంస్థలకు కాకుండా మహిళా సంఘాలకు అప్పగించాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేసి జీఓ నంబర్‌ 7, 8, 9లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు, పీడీఎస్‌యూ రాష్ట్ర కన్వీనర్‌ అనుష, రాజు, సిద్దు, వంశీ, ప్రశాంత్‌, కల్యాణ్‌, శ్యామ్‌, అక్షయ్‌, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌

బంద్‌ విజయవంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement