ఎమ్మెల్యే కడియం శ్రీహరి
వేలేరు: గండి రామారం ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి మండలానికి త్వరలోనే గోదావరి జలాలు తీసుకొస్తానని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని శాలపల్లి, గొల్లకిష్టంపల్లి గ్రామాల్లో గురువారం ఇందిరమ్మ ఇళ్లు, సీసీ రోడ్లు, మహిళా సమాఖ్య భవనం, గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఓవ్యక్తి నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. ఒక్క శాలపల్లిలోనే తాను రెండున్నరేళ్ల కాలంలో రూ.4 కోట్లపై చిలుకు అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. వేలేరు నుంచి పీచర వరకు రూ.6 కోట్లు, మరో రూ.5 కోట్లతో పీచర నుంచి లోక్యాతండా వరకు పీఆర్ రోడ్లు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా గండి రామారం లిఫ్ట్–1 పనులు వేగంగా జరుగుతున్నాయని అతిత్వరలోనే మండలానికి గోదావరి జలాలు తీసుకొచ్చి రెండు పంటలకు సాగునీరు అందిస్తానన్నారు. కేజీబీవీలో రూ.5.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కిషన్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు బిల్లా యాదగిరి, అశోక్, మనోజ్, శ్రీనివాస్, సాంబయ్య, రాజు, పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ కత్తి సంపత్, ఏఓ పద్మ, పీఆర్ ఏఈ రూపావతి, ఏపీఎం అనిత, ఏపీఓ విజయ, మండల మహిళా స మాఖ్య అధ్యక్షురాలు రేణుక, ఉపసర్పంచ్‌లు రమేశ్, సూర్యనారాయణ, నాయకులు మ ల్లికార్జున్, ప్రమోద్ రెడ్డి, రాజిరెడ్డి, సద్దాంహుస్సేన్, రణధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


