కాళోజీ సెంటర్: ఈ విద్యా సంవత్సరంలో లక్ష్యం మేరకు ఇంటర్మీడియేట్‌లో అడ్మిషన్లు పెంచడానికి కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేయాలని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని నెక్కొండ, సంగెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలల్లో అడ్మిషన్లు, తరగతులు, మైనర్ రిపేర్లు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలను సమీక్షించారు. ఆయా కళాశాలల అధ్యాపకులతో మాట్లాడుతూ ఇంటర్ కమిషనర్ ఆదేశాల మేరకు రోజువారీ అడ్మిషన్ల పెంపుపై దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్ధారిత లక్ష్యం 1311కు గాను 957 మంది విద్యార్థులు చేరారని, మరో రెండు వారాల్లో 400 పైగా అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు మాధవరావు, కరుణశ్రీ, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
డీఐఈఓ శ్రీధర్ సుమన్


