ఎన్యూమరేషన్‌ ఫారాలు డిజిటలైజేషన్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్యూమరేషన్‌ ఫారాలు డిజిటలైజేషన్‌ చేయాలి

Jul 8 2026 1:20 AM | Updated on Jul 8 2026 1:20 AM

దుగ్గొండి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌ఓలకు ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్‌ ఫారాలు సేకరించి డిజిటలైజేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ సత్యశారద అన్నారు. మండలంలోని లక్ష్మీపురం, దుగ్గొండి గ్రామాల్లో ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఓటర్లకు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించారా.. లేదా.. ఎంతమందికి అందించారు. ఇంకా అందించాల్సి ఉందా.. అందించిన ఫారాల నుంచి ఎన్నింటికి తీసుకుని డిజిటలైజ్‌ చేశారనే వివరాలను పరిశీలించారు. ఫారం పూర్తి చేయడంలో ఏర్పడుతున్న ఇబ్బందులను ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. బీఎల్‌ఓలు ఓటర్ల ఇళ్ల వద్దకు వెళ్లి వారి సమక్షంలోనే ఫామ్‌ నింపి డిజిటలైజేషన్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్‌డీఓ ఉమారాణి, తహసీల్దార్లు రవిచంద్రారెడ్డి, సమ్మక్క, డీటీ రఘు, సర్పంచ్‌లు కామిశెట్టి ప్రశాంత్‌, కన్నం అలీమాచిరంజీవి, పంచాయతీ కార్యదర్శులు, జీపీఓలు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పరిశీలన

నల్లబెల్లి: మండలకేంద్రంలో కొనసాగుతున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను కలెక్టర్‌ సత్యశారద మంగళవారం పరిశీలించారు. బూత్‌ లెవల్‌ అధికారులు చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను సమీక్షించి ఈ నెల 24వ తేదీలోగా ఎన్యూమరేషన్‌ ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, జిల్లా పంచాయతీ అధికారి ప్రేమలత, తహసీల్దార్లు ముప్పు కృష్ణ, రవిచంద్రరెడ్డి తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement