ధర్మసాగర్: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మంగళవారం హనుమకొండ కనకదుర్గ కాలనీలోని తన నివాసంలో మండలంలోని ఆరు గ్రామాల్లో రూ.61.24 లక్షల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల మంజూరు పత్రాలను సర్పంచ్‌లకు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు నిరంతరం జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెసరు రమేశ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


